కేంద్ర పథకాల నిధుల సాధనలో ఏపీ ప్రభుత్వం ముందడుగు

రిపోర్టర్: రాజేష్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా భారీగా నిధులు రాబడుతోంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో 86 పథకాల కింద రూ.25,304 కోట్లు మంజూరు చేయించుకుంది. సీఎం చంద్రబాబు మార్గదర్శనంలో వివిధ శాఖల ద్వారా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఈ నిధులు సద్వినియోగం చేస్తున్నారు. పంచాయతీరాజ్, గృహనిర్మాణం, వైద్యం తదితర శాఖలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు.