సోరియాసిస్ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే తీవ్ర ముప్పేనని నిపుణుల హెచ్చరిక
రిపోర్టర్: సతీష్
స్థలం: తెలంగాణ
చర్మంపై తరచూ దురద రావడం, ఎర్రని మచ్చలు ఏర్పడడం వంటి సమస్యలను చాలామంది సాధారణ చర్మ వ్యాధులుగా భావిస్తుంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరు వీటిని ఎగ్జిమా లేదా చుండ్రుగా పొరబడుతుంటారని వారు తెలిపారు. అయితే ఇవి దీర్ఘకాలిక సొరియాసిస్ లక్షణాలు కావచ్చని, రోగనిరోధక వ్యవస్థలో మార్పుల వల్ల ఇది ఏర్పడుతుందని నిపుణులు స్పష్టం చేశారు. దీనికి శాశ్వత నివారణ లేనప్పటికీ, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా లక్షణాలను నియంత్రించుకోవచ్చని వైద్యులు పేర్కొన్నారు.