రిమ్స్ ఆసుపత్రి ప్రమాదంపై మాజీ మంత్రి జోగు రామన్న ఆవేదన

రిపోర్టర్: సురేష్ స్థలం: అదిలాబాద్

అదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ ఘటనలో ముగ్గురు శిశువులు మృతి చెందిన ప్రాంతాన్ని మాజీ మంత్రి జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మంగళవారం పరిశీలించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించిన వారు, మృతుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి నిర్వహణలో వైఫల్యంపై బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.