బొబ్బిలి పారిశ్రామికవాడలో భద్రతా వైఫల్యం: తరచూ ప్రమాదాలతో బలవుతున్న కార్మికులు
రిపోర్టర్: అశోక్
స్థలం: బొబ్బిలి
బొబ్బిలి పారిశ్రామికవాడలోని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం బెర్రీ పరిశ్రమలో బాయిలర్ పేలిన ఘటనపై అధికారులు ఆరా తీస్తున్నారని, కాలం చెల్లిన యంత్రాల నిర్వహణపై నిఘా కొరవడిందని, సంబంధిత శాఖలు తూతూమంత్రపు తనిఖీలతో సరిపెడుతున్నాయని ఆర్డీవో రామ్మోహనరావు పేర్కొన్నారు.