బాపట్ల జిల్లాలో నిర్మానుష్య ప్రాంతాల్లో పోలీసుల ప్రత్యేక తనిఖీలు

రిపోర్టర్: మహేష్ స్థలం: బాపట్ల

బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా నిర్మానుష్య ప్రాంతాలు, పాడుబడిన భవనాలు అలాగే అనుమానాస్పద ప్రదేశాలను పోలీసులు ముమ్మరంగా తనిఖీ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ, అసాధారణ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు స్పష్టం చేశారు.