శిశువు దత్తత పేరుతో రూ.1.40 లక్షల మోసం: ఆరుగురు అరెస్ట్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో శిశువును దత్తత ఇప్పిస్తామని నమ్మించి మహిళ నుంచి రూ.1.40 లక్షలు వసూలు చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా ద్వారా బాధితురాలిని సంప్రదించిన నిందితులు, డబ్బు తీసుకున్న తర్వాత గొడవ పడుతున్నట్లు నటించి పరారయ్యారు. నిందితుల నుంచి నగదు, వాహనాలు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఇల్లందు డీఎస్పీ వెంకన్నబాబు తెలిపారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలింపు కొనసాగుతోంది.