డ్రైవింగ్ లైసెన్సుల జారీలో ఏఐ సాంకేతికతకు రవాణా శాఖ శ్రీకారం
రిపోర్టర్: శివ
స్థలం: తెలంగాణ
డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియలో దళారుల ప్రమేయానికి శాశ్వతంగా తెరదించేందుకు రవాణా శాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను తీసుకువస్తోందని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎం. చంద్రశేఖర్ గౌడ్ వెల్లడించారు. మారుతి సుజుకి భాగస్వామ్యంతో రాష్ట్రంలో డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లను ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. మొదటి విడతలో క్యూర్ పరిధిలోని 5 ట్రాక్‌లతో పాటు కరీంనగర్ ట్రాక్‌ను ఏఐ నిఘాలోకి మారుస్తున్నామని, దీనివల్ల నైపుణ్యం ఉన్నవారికే లైసెన్సులు లభిస్తాయని అధికారులు స్పష్టం చేశారు.