దేశ రాజధానిలో కలకలం: ఒకే రోజు రెండు వేర్వేరు మాక్ పార్లమెంట్లు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: ఢిల్లీ
దేశ రాజధాని ఢిల్లీలో ఒకే రోజు రెండు వేర్వేరు వర్గాలు ప్రతిష్టాత్మకంగా మాక్ పార్లమెంట్ నిర్వహించేందుకు సిద్ధమయ్యాయని నిర్వాకులు తెలిపారు. సీఈసీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఇండియా కూటమి శుక్రవారం నాడు మాక్ పార్లమెంట్ నిర్వహించి అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అదే రోజు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వేదిక ఆధ్వర్యంలో సమాంతరంగా మరో మాక్ పార్లమెంట్ ప్రదర్శనను చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వాలను పడగొట్టే యత్నాలు, అరాచకత్వాన్ని వ్యాప్తి చేసే కుట్రలకు నిరసనగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.