సింగరేణి సంస్థ సీఎండీ ఆదేశం: నైనీ గనిలో బొగ్గు ఉత్పత్తి పెంపు
రిపోర్టర్: వెంకట్
స్థలం: కొత్తగూడెం
ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ నుంచి నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని అధికారులను సింగరేణి సంస్థ సీఎండీ డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి ఆదేశించారు. శనివారం సింగరేణి భవన్ లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్ర విద్యుత్ అవసరాలు పెరిగే అవకాశమున్నందున, నైనీ గని నుంచి రోజుకు కనీసం ఇరవై వేల టన్నులకు పైగా బొగ్గును రవాణా చేసేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.