పొదలకూరు ఎంపీటీసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తున్న వాకాటి సంధ్య

రిపోర్టర్: AHMED స్థలం: పొదలకూరు

నెల్లూరు జిల్లా పొదలకూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ఆశీస్సులతో బిట్–2 వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి వాకాటి సంధ్య ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రజలను కలుసుకుంటూ వైఎస్సార్సీపీకి మద్దతు ఇవ్వాలని కోరారు. జగన్ పాలనలో సంక్షేమ పథకాలు అందాయని, స్థానిక ఎన్నికల్లో పార్టీ జెండా ఎగురవేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.