పెద్దల పాదపూజతో సంస్కృతీ సాంప్రదాయాలు చాటిన విద్యార్థులు

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

చౌటుప్పల్ పురపాలక సంఘ పరిధిలోని విశాల భారతి పాఠశాలలో గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలను శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ తాతయ్యలు, నానమ్మలు మరియు అమ్మమ్మల పాదాలకు పూజలు నిర్వహించి వారి అమూల్యమైన ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ముత్యం శ్రీనివాస్ మాట్లాడుతూ పెద్దలు పిల్లలకు అనురాగంతో పాటు సమాజంలో నడుచుకోవాల్సిన జీవన విలువలు, సంప్రదాయాలు నేర్పించే దివ్య మార్గదర్శకులని పేర్కొన్నారు. భావితరాలకు సత్సంప్రదాయాలు నేర్పేందుకు ఈ తరహా కార్యక్రమాలు ఎంతగానో తోడ్పడతాయని తెలిపారు.