అఫ్గానిస్తాన్‌తో టీ20: చెలరేగిన భారత బౌలర్లు
రిపోర్టర్: రమేష్
స్థలం: India
అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. బుమ్రా దెబ్బకు తొలి ఓవర్లోనే ఓపెనర్ గుర్భాజ్ అవుట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫీల్డింగ్‌తో రనౌట్ చేయగా, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ వరుస వికెట్లతో అఫ్గాన్ జట్టును దెబ్బతీశారు. ఐదు ఓవర్లకే మూడు వికెట్లు కోల్పోయి అఫ్గానిస్తాన్ కష్టాల్లో పడింది.