వైరల్ అవుతున్న అభిషేక్ శర్మ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఫొటోలు

రిపోర్టర్: మహేష్ స్థలం: India

టీమ్ఇండియా విధ్వంసకర ఆటగాడు అభిషేక్ శర్మ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సెప్టెంబర్ 4న తన జన్మదినాన్ని జరుపుకున్న అభిషేక్ శర్మ, ఇందుకు సంబంధించిన సెలబ్రేషన్స్ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోల్లో ఆయన ఎంతో ఉత్సాహంగా కేక్ కట్ చేస్తూ కనిపించగా, నెటిజన్లు, క్రీడాకారులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.