తుపానుకు నేలకొరిగిన భారీ చెట్టును తొలగించి రాకపోకలు పునరుద్ధరించిన పోలీసులు
రిపోర్టర్: MADHIRI CHANTIBABU
స్థలం: జి.కె.వీధి
తుపాను ప్రభావంతో గూడెంకొత్తవీధి మండలం దుచ్చరపాలెం సమీపంలో రోడ్డుపై పడిన చెట్టును జీకేవీధి ఎస్సై సురేష్ చొరవతో తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. తుపాను నేపథ్యంలో వాహనదారులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయరాదని, బలమైన గాలులు వీచే సమయంలో చెట్ల కింద నిలబడరాదని, రహదారులపై అడ్డంకులు కనిపిస్తే సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం అందించాలని అధికారులు కోరారు.