రైలు ప్రయాణికులకు బిగ్ రిలీఫ్ ఇస్తూ రిజర్వేషన్ గడువు కుదింపు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పాలకొండ

భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైలు టికెట్ల ముందస్తు రిజర్వేషన్ గడువును నూట ఇరవై రోజుల నుంచి అరవయ్యో రోజులకు తగ్గించింది. ఈ కొత్త నిబంధన నవంబర్ మొదటి తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. దళారుల బెడదను తగ్గించడంతో పాటు చివరి నిమిషంలో టికెట్ల రద్దులను నివారించడమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశమని రైల్వే అధికారులు తెలిపారు.