నారాయణపేటలో ఉచిత పోలీస్ కోచింగ్ పరీక్షకు నాలుగు వందల మంది హాజరు

రిపోర్టర్: అశోక్ స్థలం: నారాయణపేట

నారాయణపేట జిల్లా కేంద్రంలోని సీఎన్ఎండీ కళాశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రవేశ పరీక్షకు నాలుగు వందల పదమూడు మంది అభ్యర్థులు హాజరయ్యారని ఎస్పీ నారాయణపేట వెల్లడించారు. త్వరలో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి ఉచిత శిక్షణ, ఫిజికల్ ఫిట్నెస్ శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్ అందిస్తామని పేర్కొన్నారు. ఈ పరీక్షకు హాజరైన మహేష్ పోగొట్టుకున్న వెయ్యి నాలుగు వందల యాభై రూపాయల నగదును గుర్తించి బాధ్యతాయుతంగా తిరిగి అందించిన ధన్వాడ హెచ్సీ శ్రీనివాసులు, ఎస్సై వెంకటేశ్వర్లు నిజాయితీని ప్రశంసించారు.