నీట్ ఎండీఎస్ కౌన్సిలింగ్ రెండో విడత మెరిట్ జాబితా విడుదల

రిపోర్టర్: భాస్కర్ స్థలం: జార్ఖండ్

జార్ఖండ్ కంబైన్డ్ ఎంట్రన్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ బోర్డ్ నీట్ ఎండీఎస్ కౌన్సిలింగ్ రెండో విడత ఫైనల్ స్టేట్ మెరిట్ జాబితాను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ ర్యాంకులను పరిశీలించుకోవచ్చని బోర్డు స్పష్టం చేసింది. సెప్టెంబర్ 26 వరకు ఆన్లైన్ ఛాయిస్ ఫిల్లింగ్ ప్రక్రియ కొనసాగుతుందని, సెప్టెంబర్ 27న ప్రొవిజనల్ సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు వెల్లడించారు.