దిశ మార్చిన పెద్దపులి.. రాజవొమ్మంగి మండలం వాతంగిలోకి ప్రవేశం
రిపోర్టర్: D.SATHISH
స్థలం: ప్రత్తిపాడు
కాకినాడ జిల్లాలో సంచరిస్తున్న పెద్ద పులి గురువారం రాత్రి పోలవరం జిల్లాలోకి ప్రవేశించింది. ప్రస్తుతం రాజవొమ్మంగి మండలం వాతంగి గ్రామ సమీపంలో ఉన్నట్లు అటవీశాఖ అధికారులు శుక్రవారం గుర్తించారు. అటవీ శాఖ సిబ్బంది పులి కదలికలను నిశితంగా పరిశీలిస్తూ నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు ఎవరూ అడవిలోకి వెళ్లవద్దని, అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.