ఖమ్మం బీసీ హాస్టల్లో ఇంటర్ విద్యార్థి అజయ్ అనుమానాస్పద స్థితిలో కన్నుమూత
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం నగరంలోని కిన్నెరసాని థియేటర్ సమీపంలోని బీసీ హాస్టల్లో ఇంటర్ విద్యార్థి అజయ్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఎంఎల్టీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి బాత్రూమ్లో అపస్మారక స్థితిలో కనిపించడంతో తోటివారు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.