కుటుంబ వారసుడిని సీఎం చేయడమే జగన్ తపన అంటూ విజయసాయిరెడ్డి సంచలనం

రిపోర్టర్: అశోక్ స్థలం: Visakhapatnam

వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమితో వైకాపా పొత్తు పెట్టుకుంటుందని, తన తదనంతరం కుటుంబంలోని వారిని సీఎం స్థానంలో కూర్చోబెట్టాలన్నదే జగన్ తపన అని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. విశాఖపట్నంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే పార్టీ నాశనమవుతోందని మండిపడ్డారు. వైకాపా, తెదేపా రెండు పార్టీలూ కుటుంబ పార్టీలేనని, కేంద్రం నుంచి ఎలాంటి లబ్ది లేకపోయినా ఆ రెండు పార్టీలు ప్రశ్నించలేవని ఆయన స్పష్టం చేశారు.