అమెరికా సైన్యంలో లీకేజీ కలకలం: ట్రంప్ సర్కార్ సీరియస్

రిపోర్టర్: గోపి స్థలం: World

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా సైన్యంలో కీలక సమాచారం లీక్ అవుతుండటంతో ట్రంప్ యంత్రాంగం అప్రమత్తమైంది. జాయింట్ స్టాఫ్ విభాగంలోని 50 మందికి పైగా సిబ్బందికి పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు. జాతీయ భద్రతకు ముప్పు కలిగించేలా ఆయుధ నిల్వల వివరాలు బయటకు రావడంపై పెంటగాన్ తీవ్రంగా స్పందించింది. సైనిక పరికరాల్లోని యాడ్ ట్రాకర్లను డిసేబుల్ చేస్తూ, గూఢచారులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.