రష్యాలో పర్యటిస్తున్న ఆర్మీ చీఫ్ జనరల్ ధిరాజ్ సేత్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Russia
భారత సైన్యాధిపతి జనరల్ ధిరాజ్ సేత్ మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం బుధవారం రష్యా చేరుకున్నారు. 2018 తర్వాత రష్యాలో పర్యటిస్తున్న తొలి భారత ఆర్మీ చీఫ్ ఈయనే. రష్యా ల్యాండ్ ఫోర్సెస్ కమాండర్ కల్నల్ జనరల్ ఆండ్రీ మోర్దిచెవ్తో ఆయన సమావేశం కానున్నారు. రష్యా సైనిక పరికరాలకు విడిభాగాల సరఫరా, రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారం, ఉమ్మడి ఉత్పత్తి అంశాలపై చర్చలు జరగనున్నాయి.