రష్యా పార్లమెంట్ ఎన్నికల్లో పుతిన్ పార్టీ అఖండ విజయం

రిపోర్టర్: గోపి స్థలం: రష్యా

రష్యాలో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కి చెందిన యునైటెడ్ రష్యా పార్టీ మొత్తం 450 స్థానాలకు గాను 355 సీట్లు కైవసం చేసుకుని అఖండ విజయం సాధించింది. ఉక్రెయిన్ తో యుద్ధం మరియు డ్రోన్ దాడుల ఉద్రిక్తతల మధ్య రాజధాని మాస్కోతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయి విజయం సాధించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధ్యక్షురాలు ఎల్లా పాంఫిలోవా స్పష్టం చేశారు.