సిరిసిల్ల మానేరు వాగులో వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
రిపోర్టర్: సతీష్
స్థలం: రాజన్న సిరిసిల్ల
సిరిసిల్ల పట్టణంలోని మానేరు వాగులో కొనసాగుతున్న వినాయక విగ్రహాల నిమజ్జన ప్రక్రియను కలెక్టర్ రాజన్న సిరిసిల్ల క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండి అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. నిమజ్జన ప్రాంతంలో పటిష్టమైన భద్రతా చర్యలతో పాటు మున్సిపల్ సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని ఆయన సూచించారు.