పలాస మున్సిపాలిటీ పదిహేడవ వార్డులో ఉత్సాహంగా వైఎస్సార్సీపీ అభ్యర్థి ఇంటింటి ప్రచారం

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పదిహేడవ వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి శ్రీను పండా ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. వార్డులోని ప్రతి వీధికి వెళ్లి ప్రజలను కలుస్తూ తనకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుంటూ పార్టీ శ్రేణులతో కలిసి విస్తృతంగా తిరుగుతున్నారు.