ఏపీ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రంతో పడనున్న తెర

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పాలకొండ

ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రం అయిదు గంటలకు తెరపడనుంది. ఆ సమయం తర్వాత ప్రచారం నిర్వహిస్తే ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద కేసులు నమోదు చేస్తారు. నవంబర్ ఒకటో తేదీన పోలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్థాయిల్లోని 772 పదవులకు నాలుగు వేల నూట నలభై మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.