సబ్ స్టేషన్ లాగ్ బుక్ మాయం చేశారంటూ హరీష్ రావు ఫైర్

రిపోర్టర్: శివ స్థలం: Telangana

కరెంట్ కోతల నిజాలు బయటపడతాయనే భయంతోనే సబ్‌స్టేషన్ లాగ్‌బుక్‌ను అధికారులు మాయం చేశారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. లాగ్‌బుక్‌లు దాచిపెట్టడం మానేసి రైతులకు సరిగ్గా కరెంట్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రభుత్వానికి ఎందుకంత భయమని హరీష్ రావు ఘాటుగా ప్రశ్నించారు.