ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో బీటెక్ యువకుడు ఆత్మహత్య
రిపోర్టర్: నరేష్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న శివప్రసాద్ అనే యువకుడు ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో ఈ నెల 23న రాత్రి గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని గోపాలపట్నం, విశాఖపట్నంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. మెరుగైన వైద్యం పొందుతూ అతడు మృతి చెందినట్లు ఎస్సై ఎన్ జోగారావు తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.