దేవరకద్రలో కాంగ్రెస్ నేతల అక్రమ ఇసుక దందా

రిపోర్టర్: రాజేష్ స్థలం: దేవరకద్ర, మహబూబ్ నగర్ జిల్లా

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో ఊకచెట్టు వాగులో కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సోదరుడు, అనుచరులు విచ్చలవిడిగా అక్రమ ఇసుక దందాకు తెరలేపారు. అధికారుల కళ్లెదుటే ఈ అక్రమ రవాణా సాగుతున్నా మామూళ్ల మత్తులో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ఆగ్రహించిన స్థానిక రైతులు అక్రమ ఇసుక రవాణాను అడ్డుకుని అధికారులను తీవ్రంగా నిలదీశారు.