హోమ్ బయ్యర్లకు భారీ ఊరట: డెవలపర్ కు వినియోగదారుల కమిషన్ షాక్

రిపోర్టర్: సునీల్ స్థలం: Chandigarh

అపార్ట్మెంట్ పొజిషన్ ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేసిన రియల్ ఎస్టేట్ సంస్థకు చంఢీగడ్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ గట్టి షాక్ ఇచ్చింది. సౌరభ్ వర్మ దంపతులకు రూ.62.7 లక్షల మొత్తం పన్నెండు శాతం వార్షిక వడ్డీతో తిరిగి చెల్లించాలని ఆదేశించినట్లు కమిషన్ అధికారులు తెలిపారు. అంతేకాకుండా మానసిక ఆవేదనకు పరిహారంగా రూ.75,000 చెల్లించాలని, అసంపూర్ణ నిర్మాణాలతో లీగల్ అనుమతులు లేకుండా పొజిషన్ లెటర్లు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.