యూకేలో వినాయక నిమజ్జనంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ
రిపోర్టర్: గోపి
స్థలం: యూకే
బ్రిటన్లోని లీసెస్టర్ నగరంలో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి సంబంధించిన ఒక వైరల్ వీడియో సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. అద్దెకు తీసుకున్న బోట్లలో ప్రయాణిస్తూ హిందువులు నిర్వహించిన ఈ నిమజ్జన తంతుపై పర్యావరణ ప్రభావం గురించి నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మరియు రంగుల వాడకం వల్ల నదులు కలుషితమవుతున్నాయని, విదేశాలలో ఇలాంటి నిబంధనల ఉల్లంఘనలు భారతీయులపై వ్యతిరేకతకు దారితీస్తాయని కొందరు యూజర్లు విమర్శించారు.