హిమాచల్ ప్రదేశ్ ఓపెన్ స్కూల్ పరీక్షలపై కఠిన నిబంధనలు

రిపోర్టర్: గోపి స్థలం: హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు సెప్టెంబర్ 16 నుంచి నిర్వహించనున్న ఓపెన్ స్కూల్ పరీక్షలకు కఠిన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ నిఘా, లైవ్ మానిటరింగ్ తప్పనిసరి చేసింది. ప్రశ్నపత్రాలను డబుల్ లాక్ భద్రపరిచి, ఆరు నెలల పాటు ఫుటేజ్ నిల్వ చేయాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రిన్సిపాల్స్, ఐటీ ఇన్‌విజిలేటర్లపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.