కార్మికుల సమస్యలపై ఈ నెల 16న సీఐటీయూ నిరాహార దీక్ష

రిపోర్టర్: నరేష్ స్థలం: మెదక్

కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ మెదక్ జిల్లా కేంద్రంలో ఈ నెల 16న సీఐటీయూ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు జిల్లా కార్యదర్శి ఏ. మల్లేశం తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో కార్మికుల సమస్యలపై చర్చించకుండా అధికార, ప్రతిపక్షాలు విమర్శలకే పరిమితమయ్యాయని మండిపడ్డారు. ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తల అరెస్టులు, లాఠీచార్జి దుర్మార్గమన్నారు. ఈ దీక్షలో కార్మికులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.