'భూ దోపిడీకి పాల్పడ్డారు': మాజీ మంత్రి హరీశ్‌రావుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైర్

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రి హరీశ్‌రావుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హరీశ్‌రావు భూ దోపిడీకి పాల్పడ్డారని, అసైన్డ్ భూములకు ఏ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా తప్పేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నకిలీ ఎన్‌ఓసీ ద్వారా భూదాన్ భూమిని, మాజీ మంత్రి గంగుల కమలాకర్ స్టేటస్ కో ఉన్నప్పటికీ నిషేధిత భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. త్వరలోనే గత ప్రభుత్వ భూ అక్రమాలపై అందరి చిట్టా విప్పుతామని పొంగులేటి హెచ్చరించారు.