నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్ష షెడ్యూల్ విడుదల

రిపోర్టర్: గోపి స్థలం: New Delhi

ఢిల్లీ ప్రభుత్వ విద్యా డెరెక్టరేట్ ఎనిమిదో తరగతి విద్యార్థుల కోసం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్ష షెడ్యూల్‌ను ప్రకటించింది. డిసెంబర్ 5, 2026న ఈ పరీక్ష జరగనుంది. ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందనుంది. అక్టోబర్ 5 వరకు దరఖాస్తులకు అవకాశం ఉంది.