నా కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ది ప్యారడైజ్ అంటున్న నాని
రిపోర్టర్: విజయ్
స్థలం: బెంగళూరు
న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ది ప్యారడైజ్ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బెంగళూరులో నిర్వహించిన ప్రెస్ మీట్లో నాని మాట్లాడుతూ తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఎక్కువ రోజులు కష్టపడి చేసిన సినిమా ఇదేనని తెలిపారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అద్భుతమైన మదర్ సన్ ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయని ఆయన పేర్కొన్నారు.