భారీ వర్షాలకు దెబ్బతిన్న పాఠశాల భవనం, ఆందోళనలో విద్యార్థులు
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: కొయ్యూరు
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలోని బొడ్డుమామిడి గ్రామంలో భారీ వర్షాల కారణంగా పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. పైకప్పు రేకులు దెబ్బతిని తరగతి గదుల్లోకి నీరు చేరుతుండటంతో విద్యార్థుల చదువుకు తీవ్ర అంతరాయం కలుగుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్లే నిర్మాణాలు ఆగిపోయాయని, పిల్లల ప్రాణాలను రక్షించేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించి పాఠశాల భవనాన్ని పునరుద్ధరించాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.