'నిండు గర్భిణీల నిత్య గోసలు': కేసీఆర్, రేవంత్ సర్కార్లపై బీజేపీ ఫైర్
రిపోర్టర్: హరి
స్థలం: Telangana
తెలంగాణలో ప్రభుత్వం మారినా నిండు గర్భిణీల బతుకులు మారలేదని బీజేపీ మండిపడింది. నాటి కేసీఆర్ పాలన నుంచి నేటి రేవంత్ రెడ్డి పాలన వరకు గర్భిణీలకు కష్టాలు తప్పడం లేదని విమర్శించింది. ఎడ్ల బండ్లు, డోలీలు, పడవల ద్వారా ఆసుపత్రులకు వెళ్తున్న దుస్థితిపై మండిపడుతూ.. ప్రభుత్వాల వైఫల్యాన్ని ఎత్తిచూపింది. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.