మద్యం మత్తులో వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని ప్రత్తిపాడు పోలీసులు హెచ్చరిక
రిపోర్టర్: D.SATHISH
స్థలం: ప్రత్తిపాడు
రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ప్రత్తిపాడు సర్కిల్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పదిహేను కేసులు నమోదయ్యాయి. కోర్టు విచారణలో నిందితులకు మొత్తం లక్ష రూపాయల జరిమానా విధించగా ఆరుగురికి జైలు శిక్ష పడింది. మద్యం సేవించి వాహనాలు నడిపినా అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికారులు గట్టిగా హెచ్చరించారు.