ఏఐ రంగంలో చైనా కంటే అమెరికానే ముందంజలో ఉంది
రిపోర్టర్: విజయ్
స్థలం: World
కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో చైనా కంటే అమెరికానే ముందంజలో ఉందని, ఈ ఆధిక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఏఐలో ఎవరు గెలిస్తే వారే ప్రపంచాన్ని గెలుస్తారని ఆయన తేల్చిచెప్పారు. కఠిన నిబంధనలు లేదా పరిశ్రమ వేగాన్ని తగ్గించాలన్న డిమాండ్లను ట్రంప్ తోసిపుచ్చారు.