హైదరాబాద్ హోటల్లో విశాఖ యువతి అనుమానాస్పద మృతి
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ మాదాపూర్ సిద్ధిఖ్‌నగర్‌లోని ఓ హోటల్లో విశాఖపట్నానికి చెందిన షారన్ నిఖిత టోప్నో అనే యువతి అనుమానాస్పదరీతిలో మృతి చెందింది. ప్రియుడు శ్రీనివాస రవితేజతో కలిసి హోటల్‌కు వచ్చిన ఆమె తీవ్ర గాయాలతో మృతి చెందగా, వైద్యులు నిర్ధారించే లోపే ప్రియుడు పరారయ్యాడు. హోటల్ గదిలో రక్తపు మరకలు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.