ఓటు హక్ కు వినియోగంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా పిలుపు

రిపోర్టర్: వెంకట్ స్థలం: Amaravati

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని కోరారు. విటీపీఎస్ కాలనీలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరళిని ఆయన పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామని, ఓటర్లు భయపడకుండా స్వేచ్ఛగా ఓటేయాలని ఆయన స్పష్టం చేశారు. ఓటింగ్ సరళిని నిరంతరం పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.