ఉత్తరాంధ్రుల ఇలవేల్పు: పైడితల్లి అమ్మవారి ఉత్సవాల సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు
రిపోర్టర్: విజయ్
స్థలం: విజయనగరం
విజయనగరం కంటోన్మెంట్లో ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు సమీపిస్తున్న వేళ భక్తుల రద్దడి విపరీతంగా పెరిగింది. సిరిమాను వృక్షాలు నగరానికి చేరిన తొలి మంగళవారం కావడంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. చదురు మరియు వనంగుడు గుడిలో అమ్మవారికి వేదమంత్రాల మధ్య పంచామృతాలతో విశేష అభిషేకాలు నిర్వహించారు. హుకుంపేటలో పండుగ వాతావరణం నెలకొనగా మహిళలు సిరిమాను వృక్షాలకు పసుపు నీటితో భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. వడ్రంగులు గురువారం నుంచి మానును తీర్చిదిద్దే ప్రక్రియను ప్రారంభిస్తారని పూజారులు తెలిపారు.