రోడ్డు ప్రమాదాలకు కారణమైన కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు
రిపోర్టర్: సునీల్
స్థలం: భువనేశ్వర్
తప్పుడు డిజైన్లు మరియు నాసిరకం నిర్మాణాల వల్ల రోడ్డు ప్రమాదాల్లో పాదచారులు ప్రాణాలు కోల్పోతే అందుకు బాధ్యులైన కాంట్రాక్టర్లు, ప్రభుత్వ ఇంజినీర్లపై నేరాభియోగాలు మోపి జరిమానాలు విధించాలని ఒడిశా ప్రభుత్వం యోచిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు పాదచారుల భద్రత నిబంధనల ముసాయిదాను ఈ నెల 24న విడుదల చేసినట్లు వెల్లడించారు. మోటార్ వాహనాల చట్టం కింద విచారణ జరిపి, నిర్మాణ సంస్థలను బ్లాక్ లిస్ట్ లో పెట్టనున్నట్లు పేర్కొన్నారు.