రికార్డు స్థాయిలో నిమ్మ ధర.. బస్తా రూ.16 వేలు!

రిపోర్టర్: మహేష్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లాలో నిమ్మ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. బహిరంగ మార్కెట్‌లో 80 కిలోల నిమ్మ బస్తా ధర రూ.16 వేలకు చేరుకుంది. అయితే తోటల్లో తగిన దిగుబడులు లేకపోవడంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఎల్నినో ప్రభావం కారణంగా సాగునీరు అడుగంటి దిగుబడి గణనీయంగా తగ్గిందని, ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.