అసంపూర్తి రహదారి పనులపై అధికారులకు వి. కొండలరావు విజ్ఞప్తి

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: అల్లూరి సీతారామరాజు

అల్లూరి జిల్లా ఐటీడీఏలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వి. కొండలరావు పాల్గొన్నారు. కించోల్డ బీటీ రోడ్డు, బ్రిడ్జి, పెద్దపుట్టు మెటల్ రోడ్డు పనులు పెండింగ్లో ఉండటంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంబులెన్సులు, వాహనాలు రాకపోకలకు వీల్లేకుండా రోడ్లు అధ్వానంగా మారాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే పనులు పూర్తి చేయాలని కోరగా, అధికారులు సానుకూలంగా స్పందించి త్వరలోనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.