యూట్యూబర్ రావణ్ ఖాతాలోకి విదేశీ నిధులు వెల్లడించిన పోలీసులు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Krishna

యూట్యూబర్ ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ ఖాతాలోకి విదేశాల నుంచి భారీగా నిధులు సమకూరినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైందని అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా ఏడు రోజుల పాటు విచారించగా సంచలన విషయాలు వెలుగుచూశాయి. విదేశాల నుంచి విడతల వారీగా సుమారు ఇరవై తొమ్మిది లక్షలకు పైగా నిధులు జమ అయ్యాయని, మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకే ఈ ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.