కరెంట్ కోతలు బొగ్గు లెక్కలపై కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ ధ్వజమెత్తారు

రిపోర్టర్: మహేష్ స్థలం: Hyderabad

తెలంగాణలో కరెంట్ కోతలు, బొగ్గు లెక్కలపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య రాజకీయ పోరు తీవ్రతరమైంది. థర్మల్ ప్లాంట్లలో బొగ్గు కొరత వల్లే విద్యుత్ ఉత్పత్తి పడిపోయిందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం చెందిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ప్లాంట్ల పరిశీలనకు వెళ్లిన గులాబీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు యాదాద్రి ప్లాంట్ డిజైన్, బొగ్గు గ్రేడ్లపై ప్రభుత్వ పెద్దలు ఎదురుదాడికి దిగుతూ రాష్ట్రంపై రూ.40 వేల కోట్ల భారం పడుతుందని స్పష్టం చేశారు.