విజయపురం మండలంలో నూతన పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: విజయపురం
చిత్తూరు జిల్లా విజయపురం మండలం పాత ఆర్కాడు పంచాయతీలో ముప్పై రెండు లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు గ్రామస్తులు పెద్దఎత్తున పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు. నూతన భవనం అందుబాటులోకి రావడం ద్వారా ప్రభుత్వ సేవలందించడం సులువువుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.