తీవ్ర అలర్ట్: ఏపీలో పలు జిల్లాల్లో పిడుగులతో మోస్తరు వర్షాలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అమరావతి
ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో ఆదివారం పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. అల్లూరి, పోలవరం, కోనసీమ, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, అనంతపురం, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. శనివారం పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది.